![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 87 లో.....నిత్యకి సూర్య రింగ్ తొడగడం జానూ చూసి ఎంత మోసమని అంటుంది. జానూ నేను తర్వాత అంతా చెప్తానని సూర్య అంటాడు కానీ జానూ వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అమ్మ హాస్పిటల్ కి వెళదామని సూర్య అనగానే భువన నవ్వుతుంది. ఈ భువన చచ్చిపోయేంత పిరికిది కాదు ఉండి సాధిస్తుందని అంటుంది సూర్యకి అంతా అర్థమై షాక్ అవుతాడు.
నీ ఎంగేజ్మెంట్ ఆ జానూ చూడాలని పిలిపించానని భువన అంటుంది. ఆ తర్వాత జానూ ఏడుస్తూ వెళ్తుంటే సింహాద్రి వెళ్లి ఏంటి కొత్తగా కన్పిస్తున్నావని అడుగుతాడు నిన్ను ప్రేమించిన నా అల్లుడితో నా కూతురికి ఎంగేజ్మెంట్ అయిందని సింహాద్రి చెప్తుంటే తనకి కౌంటర్ ఇచ్చేలాగా జాను మాట్లాడుతుంది. మరొకవైపు మురళిని తీసుకొని నందు రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడ మురళిని డీసెంట్ గా ఉండమని చెప్తుంది కానీ మురళి మాత్రం ఫస్ట్ టైమ్ రెస్టారెంట్ కి వచ్చినట్లు బెహేవ్ చేస్తాడు. బిల్ అంతా అయిందా అంటూ చిల్లర లెక్కపెడతాడు. అందరు తననే చూస్తారు.
బయటకి వచ్చాక ఏంటి బావ నేను నా కోరుకున్న లైఫ్ ని కోల్పోయాను కానీ ఈ లైఫ్ లో అయినా బాగుండాలి అనుకుంటా కదా అని నందు అనగానే సరే నందు ఇంకొకసారి ఏ అవకాశం దొరికినా కూడా వదులుకోను.. నిన్ను హ్యాపీగా చూసుకుంటానని మురళి చెప్తాడు. ఆ తర్వాత కిన్నెర ఆడుకుంటూ కిందపడిపోతుంది. వెంటనే జానూకి ఫోన్ చేసి చెప్తారు. తరువాయి భాగంలో కిన్నెర హార్ట్ లో ప్రాబ్లమ్ ఉంది వెంటనే ఆపరేషన్ చెయ్యలి ఇరవై అయిదు లక్షలు అవుతుందని డాక్టర్ చెప్తారు. అది విని అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |